పేజీలు

2, సెప్టెంబర్ 2023, శనివారం

మనసుంది కానీ...

చాలా మంచిపనులు చేయాలని ఉంది ఆయనకు. కాని టైం ఉండడం లేదు. ఉండడం లేదంటే సరిపోవడం లేదు. సరిపోవడం లేదని ఊరుకుంటే ఎలా? రోజూ పేపర్లలో మంచి పనులు చేస్తున్నవాళ్ల ఫోటోలు వేసి వాళ్ల గురించి ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. అంతమందికి తీరగా లేనిది తనకొక్కడికే తీరడం లేదంటే ఎవరు నమ్ముతారు?
ఇకనుంచి ప్రతి ఆదివారం మంచిపనులకు కేటాయిద్దామనుకున్నాడు.
నిర్ణయమైతే తీసుకున్నాడు కాని పరిస్థితులు తనకు సహకరించడం లేదనిపించింది ఆయనకు. భార్యా పిల్లలు ఏదో ఒక పని చెప్పడం లేదా బంధువులొచ్చి రాత్రి దాకా ఉండిపోవడం, ఆఫీసువాళ్లు ఫోన్లు చేసి ఏదో ఒకటి అడగడం... మొత్తానికి మంచి పనులు చేయడం ఆ రోజు వీలు కావడం లేదు.

ఆదివారాలు వదిలేసి మిగతా రోజుల్లోనే పొద్దుటిపూట ఒక గంట మంచి పనులకు కేటాయిద్దాం, ఆరుగంటలూ కలిపి ఒక వర్కింగ్ డే అవుతుందనుకున్నాడు. అనుకున్న ప్రకారం ఆరింటికే నిద్రలేవసాగాడు కాని పేపర్‌లో ముఖ్యమైన వార్తల్ని చూసి వెళ్దామన్న బలహీనత ఆయనకు అవరోధంగా మారింది. పేపర్ నిండా చెడ్డ పనులు చేసిన వాళ్ల గురించి తాటికాయల్లాంటి అక్షరాలతో వార్తలు ఉండడంతో అవి చదివేసరికి ఆయనకు నిస్సత్తువ, నిరాశ, నిస్పృహ... ఆ క్రమంలో ఆవరించి గుమ్మం లోపలే కుర్చీకి మూడడుగుల దూరంలోనే చతికిల పడిపోసాగాడు.

ఇలా కొంతకాలం గడిచాక మంచి పనులకు పొద్దుటి ముహూర్తం బాగా లేదని సాయంత్రానికి మార్చుకున్నాడు. మార్చాడే గాని మూడు నాలుగు రోజులకే తెలిసిపోయింది ఆయనకు మంచి పనులు చేయడానికి సాయంత్రాలలో చోటు దొరకదని. ఆ టైంలో రోడ్లన్నీ వాహనాలతో నిండి ఉంటాయి. మనుషుల బుర్రలన్నీ ప్రపంచం మీద కోపంతో, కసితో నిండి ఉంటాయి. అప్పుడు మంచి పని చేయడం తనకెంత కష్టమో, తాను చేసే మంచి పనుల్ని జనం గుర్తించడం గాని గమనించడం గాని అంతకంటే కష్టం అని అర్థమైంది ఆయనకు.
ఆ రోజు రాత్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు. 'వేళాపాళా లేకుండా మంచి పనులు చేయడం ఈ లోకంలో సాధ్యం కాదు. అందుకే మంచి చేయాలన్న తలపు ఉండి కూడా ఈ లోకంలో ఎక్కువ మంది (నా లాగా) మంచివాళ్లు కాలేకపోతున్నారు.'

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

disclaimer

ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను. ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు