పేజీలు

16, ఏప్రిల్ 2023, ఆదివారం

నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఆధార్ కార్డు పుట్టిన తేదీ మార్చడానికి వెలితే ఇన్ని కష్టాలా BIG SCAM ఛేదించాను

 నేను మెదట ప్రైవేటు ఆధార్ కేంద్రానికి వెల్లాను అక్కడ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండే వారు నా అడ్రస్ కూడా వాడే change  చేసాడు ఇంతకు ముందు అయితే ఇప్పుడు ఎవరూ లేరు అలానే చిన్న బ్యానర్ పెట్టుకున్నాడు కరక్షన్ ఉందా అంటే ఉంది అన్నాడు ఆధార్ నెంబరు అడుగుతాడనుకున్నా కాదు నా 10th సర్టిఫికేట్ అడిగాడు వెంటనే scanning తీసి ఒక drive లో భద్రంగా దాచాడు తరువాత నా కార్డు నెంబరు కొట్టి చూస్తున్నాడు నేను ఇప్పుడు నా ఫింగర్ పెట్ట మంటాడు అనుకున్నాను కానీ otp చెప్పు అన్నాడు వెంటనే నా మెబైల్ open చేసి వచ్చిన ఆధార్ otp చెప్పాను వెంటనే నాకు ఏదో చూపించి నువ్వు ఇంతకు ముందే ఒకసారి కరక్షన్ చేసావు కాబట్టి నీకు కుదరదు అన్నాడు వెంటనే  ఒక దారి ఉంది నువ్వు ఇండియాలో ఎక్కడికెల్లినా అవ్వదు కాబట్టి కేవలం బేంగుళూరులో మాత్రమే అవుతుంది... అయితే 4950 రూపయలు ఇస్తే మా దగ్గర పని అవుతుందని చిన్నగా అసలు విషయం చెప్పాడు ఎక్కడో jio mart లో అంట ఆధార్ పాన్ ఒకే DOB లేదని వాల్లకు ఉద్యోగం రాలేదని  అన్నాడు ... అంటే 5 వేల కోసం జాబ్ వదులుకోవడం కరక్టు కాదు అని వెదవ సలహా వాడే ఇస్తున్నాడు......----- సశేషం

......................................................

ఆ తరువాత నాకు తెలిసిన ఒక స్నేహితుడికి విషయం చెప్పా తనకు తెలిసిన వారిని అడుగుతానని ఫోన్ చేసాడు ఇలా DOB కరక్షన్ కు 12000 అవుతుంది కానీ మీరు తెలిసిన వారు కాబట్టి 11 వేలకు చేయగలనని చెప్పాడు గోవిందా.....అయితే నా ప్రయాణం ఇక్కడ ఎందుకు ఆగుతుంది అసలే చాలా ఖాలీగా ఉన్నాను చూద్దాం ఏదో ఒక మార్గం దొరుకుతుందా అని.... సశేషం

.................................................

ఈ మద్యలో నేను twitter లో  aadhar వారికి tweet చేసి అడగటం మెదలు పెట్టాను how to chang dob అని వాల్లు ఎప్పటికో సమాధానం ఇచ్చారు మామూలుగానే చేసుకోండి ఏం సమస్య ఉండదు ....... అరె వీల్లేమో 10 వేలు లేదా 5 వేలు అడుగుతుంటే వాల్లు 50 రూపయలు ఇచ్చి మామూలుగానే చేసుకోండి అంటున్నారు ఏం అర్దం కాలేదు ---- సశేషం

https://twitter.com/Aadhaar_Care/status/1633711915959721985

................................................

 ఆ తరువాత నేను official list of aadhar centers in jangareddigudem ద్వారా మా ఇంటి పక్కనే ఉన్న bsnl office లో కూడా ఆధార్ సెంటర్ ఉందని గ్రహించాను మరియు పోస్టు ఆఫీస్ లో కూడా సెంటర్ ఉంది  తరువాత bsnl office కు వెల్లాను ......... అక్కడ తన తెలివితేటలు ప్రదర్సించాడునా 10th సర్టిఫికేట్ అడిగాడు వెంటనే scanning తీసి ఒక drive లో భద్రంగా దాచాడు సేమ్ ప్రాసెస్ ఫింగర్ తో కాకుండా otp తో ఆధార్ కార్డు open చేసాడు సేమ్  సేమ్ సేమ్  అందరూ అంతేగా మనీ మనీ మనీ నీకు ఇండియాలో ఎక్కడా అవ్వదు హైదరాబాదుకు వెల్లాలి అన్నాడు అక్కడ బెంగులూరు ఇక్కడ హైదరాబాద్ ఎదవలకు sync లేదు పైగా నాకు ఒక సలహా ఇచ్చాడు నువ్వు హైదరాబాద్ వెలితే ఈజీగా అక్కడ  stay చేయడాని ఇతర ఖర్చులు కలిపి 5 వేలు అవతుంది అదేదో వాల్లు చెప్పినట్టు 5 వేలు ఇచ్చి చేయించుకున్నా సరిపోతుంది అన్నాడు పైగా నాకు తన ఫోన్ నెంబరు ఇచ్చి సాయంత్రం చేయమని చెప్పాడు ఖతం----చూడబోతే అందరూ కుమ్మకైనట్టు ఉంది పాన్ ఆధార్ లింకింగ్ డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది------   ఇంక నాకెలానో అర్ధం కాలేదు ఇంక ఇంతకు మించి దారి లేదేమో అనుకున్నాను --------- సశేషం

-------------------------------------------

వెంటనే పోస్టు ఆఫీస్ కు వెల్లాను అక్కడ తీసేసాడని చెప్పారు - సశేషం

---------------------------------------

ఈ  twitter లో already సమాధానాలు చెబుతున్నారు ఆధార్ వారు మీకు కుదురుంతుంది కుదరకపోతే exception list లో చేద్దాం అని అదేదో అరటికాయ వలచిన చందంగా చాలా ఈజీ అన్నట్టు వారి మాటలున్నాయి. ఎక్కడో తేడా కొడుతుంది.. ఏం చేయాలో అర్ధం కావడం లేదు నేను కాబట్టి 5 వేలకు కక్కుర్తి పడి 10 రోజుల నుండి తిరుగుతున్నాను ఇంకొకడయితే రోజుకు సంపాదించే 1000 రూపయల సంపాదన పోతున్నాయి ఇక్కడ తిరగడం వల్ల అని ఆ 5 వేలు ఇచ్చేసి settle చేసుకుంటాడు కానీ నేను ఇంట్లో ఖాలీగానే ఉంటాను ఎక్కువ శాతం అందువల్లే తిరుగుతున్నాను పైగా ఇది గవర్నమెంటు సర్వీసు ఉచితంగా దొరికే సర్వీసు దీనకి అంతేసి డబ్బులు కట్టడం కరక్టు కాదనుకున్నా....సశేషం

---------------------------------------

ఆలోచిస్తూ మా ఇంటికి వెల్లే దారిలో ఆధార్ పేమెంట్సు చేసే షాపు ఒకటి ఉండేది అది close చేసి షాపు rent కి పెట్టాడు... పాత బోర్డు అలానే ఉంది నేను ఆ బోర్డులో ఉన్న నెంబరు తీసుకొని అతనికి ఫోన్ చేసాను ఇలా పరిస్దితి చెప్పి నువ్వేమైనా చేయగలవా అని .... తను ఒకటే అన్నాడు "అసలు నీకు DOB కుదరదని వాల్లకు ఎలా అర్ధమవుతుంది వాల్లకు కనపడదు కదా అది మీకు మత్రమే కనపడుతుంది కానీ వారికి మామూలుగానే open అవ్వాలి కదా అని "  పైగా నాకు సహాయం చేసే ప్రయత్నం  చేసాడు వేరే ఊరికి వెల్లి చేయుంచుకోండి ఒక అడ్రస్ కూడా చెప్పాడు ---  ఇక్కడ అంతా SCAM జరుగుతుందని నాకు అర్దమయింది. ఇప్పుడు అర్దమయింది అందరూ ఎందుకని ఫింగర్ కాకుండా OTP అడిగి LOGIN అవుతున్నారో....సశేషం

---------------------------------

NEXT DAY BSNL OFFICE కి వెల్లి బాబు మాకు OTP కాదు ఫింగర్ నుండి OPEN చేయి అని అడిగాను బాబోయ్ SCAM చేసే వాల్లకు ఇలాంటివి సెట్ అవ్వవు కదా అలా OPEN చేయలేము అన్నాడు ఎందుకో కూడా చెప్పాడు వాల్లకు అంటా సరిగ్గా అన్నీ లేకపోతే 10 వేలు 25 వేలు పైనుంచి ఫైన్ విధిస్తున్నారంట అందుకనే OTP ద్వారా LOGIN అయ్యి అన్నీ చెక్ చేసుకొని చేస్తున్నాము అన్నాడు నా విషయంలో కూడా ఫింగర్ కుదరదన్నాడు.... వాల్లు ఇంత గట్టిగా ఉంటే పిచ్చెక్కుతుంది... ఇంత కష్టపడి ఉపయోగం లేదా అనుకున్నాను....... సశేషం

--------------------------------

NEXT ఇంకెక్కడా ఉన్నాయి అని వెతకగా ఆంధ్రా బ్యాంకు లో కూడా ఒక ఆధార్ సంటర్ ఉంది కాకపోతే అక్కడ బాగా రష్ ఎక్కువ కానీ డబ్బుకు భానిసయిన ఈ ప్రపంచంలో వారి నుండి తప్పించుకోవడం తప్పదు కదా అయితే ఈ సారి ఆంధ్రాబ్యాంకుకు వెల్లినపుడు ఫోన్ SWITH OFF చేసాను ఎలాంటి పరిస్దితిలో OTP చెప్పకూడదనుకున్నాను ... అద్బుతం వాడు అసలు OTP అడగలేదు కేవలం ఫింగర్ పెట్ట మన్నాడు ఇంక చూస్తో నా ఆనందం మామూలు గానే OPEN అయ్యింది నా DOB మార్చేసాడు    వారు 10 వ తరగతి సర్టిఫికేట్ అడగలేదు పాన్ కార్డు సరిపోతుందని చెప్పాడు వారం రోజుల్లో నా DOB మారిపోయింది

--------------------------------

ముగింపు. - అమాయకంగా ఉన్న వాడి దగ్గర డబ్బు సంపాదన ఎలానో నాకు అర్దమయింది.... ప్రతీ ఒక్కడూ సర్టిఫికేటు ను కాపీ తీసుకుంటున్నాడు డేటా చోరీ ఎలానో అర్ధమయింది... నిజానికి ఇది ప్రజల అమాయకత్వం కాదు వారికి ఉన్న బద్దకం అందుకే ఇలాంటి కేటగాల్లకు కాసుల పంట ఇస్తుంది. 

**************** ఫిర్ మిలేంగే ( మళ్లీ కలుద్దాం)*****************











1 కామెంట్‌:

disclaimer

ఈ బ్లాగ్‌లో పంచుకున్న సమాచారం, సేవలు మరియు ఉత్పత్తులు రచయిత, విక్రేత లేదా ప్రచురణకర్త వైద్యం, చట్టం లేదా ఇతర నిపుణుల సలహాలను ప్రతిస్థాపించే ఉద్దేశ్యంతో ఇవ్వబడలేదని వినియోగదారుడు అర్థం చేసుకోవాలి. ఈ బ్లాగ్‌లోని సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ బ్లాగ్‌లోని కంటెంట్ ఇంటర్నెట్ నుండి సేకరించబడింది మరియు ఆ వనరుల ఖచ్చితత్వానికి నేను హామీ ఇవ్వలేను. ఈ సమాచారం యొక్క ఉపయోగం వల్ల కలిగే ఏదైనా నష్టానికి నేను బాధ్యత వహించను. ఏదైనా చర్య తీసుకోవడానికి ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ఈ బ్లాగ్‌లోని లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా, మీరు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు దారితీస్తారు, అది నా నియంత్రణలో లేదు. ఆ వెబ్‌సైట్‌ల కంటెంట్ లేదా ఖచ్చితత్వానికి నేను బాధ్యత వహించను. ఈ బ్లాగ్‌లోని అభిప్రాయాలు నావి మాత్రమే మరియు నా ఉద్యోగదాత లేదా ఇతర సంస్థల అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని సమాచారం తప్పు లేదా పాతది కావచ్చు. నేను వాటిని తరచుగా నవీకరించడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎల్లప్పుడూ తాజాగా ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్‌లోని వ్యాఖ్యలు వ్యాఖ్యాతల అభిప్రాయాలు మాత్రమే మరియు నా అభిప్రాయాలను ప్రతిబింబించకపోవచ్చు. నేను అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించే హక్కును కలిగి ఉన్నాను.

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు